రిలీజ్ అయిన మొదటి రోజు అసలు డే 1 రికార్డుల పరంగా ఏమాత్రం చెక్కు చెదరదు అనుకున్న ఆర్ ఆర్ ఆర్ మమ్మోత్ 235 కోట్ల డే 1 కలెక్షన్స్ రికార్డ్ ను సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా ఇతర బిగ్గెస్ట్ పాన్ ఇండియా…
సక్సెస్ ను సొంతం చేసుకున్న సినిమాల మీద మంచి లీడ్ తో దూసుకు పోతూ ఉండగా రెండో రోజు వర్కింగ్ డే లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా సాలిడ్ ట్రెండ్ తో లీడ్ ని మెయిన్ టైన్ చేసింది…
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాల్ బస్టర్ ల పరంగా మొదటి 3 రోజుల్లో ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రికార్డు ఇది వరకు 2017 టైంలో వచ్చిన బాహుబలి2 సినిమా పేరిట ఉండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను సైతం బ్రేక్ చేసి ఏకంగా 85 కోట్ల లీడ్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది…
బాహుబలి2 మూడు రోజుల్లో 509 కోట్ల ఎపిక్ వసూళ్ళని అందుకుంటే ఇప్పుడు ఆల్ మోస్ట్ 85 కోట్ల లీడ్ ను సొంతం చేసుకున్న పుష్ప2 మూవీ 594 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో సంచలనం సృష్టించింది….మిగిలిన సినిమాలు పుష్ప2 తో పోల్చితే రేసులో వెనకబడే ఉన్నాయి…
ఒకసారి సౌత్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ మొదటి 3 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
South Biggest movies 3 Days WW Collections(Gross)
👉#Pushpa2TheRule – 594CR~🔥🔥🔥🔥
👉#Baahubali2 – 509CR
👉#RRRMovie – 496CR
👉#KGFChapter2 – 430.20CR
👉#Kalki2898AD – 380.70CR
👉#Salaar – 330CR
మొత్తం మీద ఊహకందని లీడ్ తో దూసుకు పోతున్న పుష్ప2 మూవీ ఇదే రేంజ్ లో ఫ్లో కంటిన్యూ అయితే లాంగ్ రన్ లో బాహుబలి2 తర్వాత ఇండియన్ మూవీస్ లో ఎపిక్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలవవచ్చు….హిందీలో లాంగ్ రన్ అంచనాలను మించిపొతే బాహుబలి2 ని టచ్ చేయడానికి ఔట్ రైట్ ఛాన్స్ ఉంటుంది కొద్దిగా…