బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది కానీ తర్వాత కొంచం స్లో డౌన్ అయింది. అయినా కానీ మాస్ ఆడియన్స్ నే ఎక్కువగా ఆకట్టుకుంటున్న సినిమా కలెక్షన్స్ పరంగా ఒక్కో అడుగు ముందుకేస్తూ హిట్ మార్క్ వైపు దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో మొత్తం మీద…
తెలుగు రాష్ట్రాల్లో 59 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 73.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరో సారి మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి దుమ్ము లేపగా అటూ ఇటూగా…
11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా 4 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తం మీద 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా సినిమా 86 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది. బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ అని చెప్పాలి 4 రోజులకు గాను. ఇక టోటల్ గా 4 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.