తమిళ్ లో రీసెంట్ గా ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసిన చిన్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family) సినిమా….మొదటి రోజే ఎక్స్ లెంట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ తో పరుగును మొదలు పెట్టగా లాంగ్ రన్ లో అంచనాలను అన్ని కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది.
ఓవరాల్ గా ఇప్పటి వరకు 87 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకున్న ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ లో సౌత్ భాషల వర్షన్ లను రిలీజ్ చేశారు. డిస్నీ హాట్ స్టార్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా తెలుగు వర్షన్ కి మంచి వ్యూవర్ షిప్ సొంతం అవుతుంది….
సినిమా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే శ్రీలంక నుండి బోట్ లో తప్పించుకుని తమిళనాడులో ఎంటర్ అయ్యే ఒక ఫ్యామిలీ ఒక కాలనీలో ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళతో ఎలా కలిసి పోయారు….ఈ క్రమంలో వాళ్ళు సిటీలోకి ఎంటర్ అయ్యే టైంలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది…
దానికి ఈ ఫ్యామిలీ కి ఏమైనా లింక్ ఉందా అని ఎంక్వయిరీ జరుగుతుంది…ఆ తర్వాత ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… మొత్తం మీద చాలా సింపుల్ స్టోరీ పాయింట్ తోనే తెరకెక్కిన సినిమా ఎమోషన్స్ ఎక్స్ లెంట్ గా వర్కౌట్ అవ్వగా ….
హృదయానికి హత్తుకునే సన్నివేశాలు, క్లీన్ ఫ్యామిలీ మూమెంట్స్ సినిమా అడుగడుగునా ఉండటంతో పెద్దగా బోర్ ఏమి అనిపించకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. శశి కుమార్ మరియు సిమ్రాన్ లు ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేయగా, చిన్న కుర్రోడు అదరగొట్టేశాడు అని చెప్పాలి.
ఇక సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ సెకెండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ హైలెట్ అని చెప్పాలి. క్లైమాక్స్ ఎపిసోడ్ కొంచం నాచురల్ గా అనిపించకపోయినా కూడా ఓవరాల్ గా సినిమా రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ ఫ్యామిలీ మూవీస్ లో ఒకటి అని చెప్పొచ్చు…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 87 కోట్లకు పైగా వసూళ్ళని అందుకుని సినిమా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగు లో కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.