బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) సినిమా ఆడియన్స్ ను అలరించడంలో తీవ్రంగా విఫలం అయ్యి మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
వీకెండ్ తర్వాత అసలు ఏమాత్రం తేరుకోలేక పోయిన ఈ సినిమా మొదటి వారానికే దిమ్మ తిరిగి పోయే షాకులు అన్ని ఏరియాల్లో ఇచ్చింది. ఆ ఇంపాక్ట్ దెబ్బకి ఇప్పుడు రెండో వారంలో సినిమా థియేటర్స్ లెక్క అత్యంత దారుణంగా పడిపోయింది ఇప్పుడు…
అది ఏ లెవల్ లో ఉందీ అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడం తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 880 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు రెండో వారానికి వచ్చే సరికి భోలా శంకర్ సినిమా థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…
నైజాంలో 40 కి పైగా థియేటర్స్ లో సినిమా రన్ ని కొనసాగిస్తూ ఉండగా సీడెడ్ లో 25 వరకు థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇక ఆంధ్ర రీజన్ లో 90 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తున్న సినిమా టోటల్ గా రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లో కేవలం…
155 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. అంటే ఆల్ మోస్ట్ రెండో వారానికి వచ్చే సరికి సినిమా ఏకంగా 725 థియేటర్స్ ని కోల్పోయి పరుగును కొనసాగిస్తుంది. ఈ మిగిలిన థియేటర్స్ లో ఇక సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.