ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, ఓవరాల్ గా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని అందుకుని కుమ్మేయగా వరల్డ్ వైడ్ గా రికార్డుల భీభత్సం సృష్టిస్తూ…
800 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో మంచి హోల్డ్ ని చూపించి 15-16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇప్పుడు అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
కర్ణాటక, తమిళ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా కేరళలో కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మూడు చోట్లా కలిపి ఇప్పుడు 10-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరింత పెరగవచ్చు…
ఇక అన్ని చోట్లా సినిమా జోరు ఒకెత్తు అయితే హిందీలో సినిమా రాంపెజ్ మరో ఎత్తుగా చెప్పాలి. ఇక్కడ వర్కింగ్ డే లోనే ఇప్పుడు ఓవరాల్ గా 5వ రోజు 46-48 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
ఇక ఓవర్సీస్ లో కూడా వర్కింగ్ డే లో హిందీ వర్షన్ జోరు చూపించడం మొదలు పెట్టడంతో అక్కడ కూడా 1 మిలియన్ కి పైగానే గ్రాస్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 5 వ రోజున సినిమా ఇప్పుడు ఏకంగా 82-85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా..
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది…ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 216 కోట్ల మార్క్ ని అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 885 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఈ అంచనాలను ఎంతవరకు మించిపోతుందో చూడాలి ఇప్పుడు.