బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సినిమాలు అన్నీ ఆడియన్స్ ముందుకు వచ్చేసి వేటి రేంజ్ లో అవి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా 5 రోజుల్లో 75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా లియో(LEO Movie) సినిమా 5 రోజుల్లో ఏకంగా 400 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర…
టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా 4 రోజుల్లో 26.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా సినిమా ఇప్పుడు 5వ రోజు మొత్తం మీద 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది.
ఇక భగవంత్ కేసరి సినిమా మాస్ రాంపేజ్ ను చూపిస్తూ ఇప్పుడు 6వ రోజు వరల్డ్ వైడ్ గా 12 కోట్ల నుండి 13 కోట్ల మధ్యలో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక లియో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 50 కోట్ల నుండి ఆ పైన గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఈ కలెక్షన్స్ తో లియో మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా…
6 రోజుల్లో ఆల్ మోస్ట్ 450 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా 32 కోట్ల నుండి 33 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా…
88 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా లియో అండ్ భగవంత్ కేసరి దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి. ఇక అన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా ఈ రోజు ఇవే రేంజ్ లో వసూళ్ళని అందుకుంటాయా లేక లెక్కలు కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి.