Home న్యూస్ 1000 మంది….30 రోజులు….అక్షరాలా 8 కోట్లు…మాస్ రచ్చ చేస్తున్న కళ్యాణ్ రామ్!

1000 మంది….30 రోజులు….అక్షరాలా 8 కోట్లు…మాస్ రచ్చ చేస్తున్న కళ్యాణ్ రామ్!

0

బింబిసార(Bimbisara) సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) తర్వాత వరుస పెట్టి నిరాశపరిచే రిజల్ట్ లను సొంతం చేసుకోగా కళ్యాణ్ రామ్ లాస్ట్ మూవీ డెవిల్ ఏమాత్రం అంచనాలను అందుకోలేక తీవ్రంగా నిరాశ పరిచే ఫ్లాఫ్ గా నిలిచింది.

ఆ సినిమా తర్వాత ఇప్పుడు వరుస సినిమాలను కమిట్ అవుతున్న కళ్యాణ్ రామ్ ఒక అన్ టైటిల్ మూవీని అలాగే బింబిసార ప్రీక్వెల్ ని చేస్తూ ఉండగా అన్ టైటిల్ #NKR21 మూవీ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగా సినిమాలో విజయశాంతిగారు కీలక రోల్ చేస్తూ ఉండగా…

మైత్రి మూవీ మేకర్స్ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా షూటింగ్ లో భాగంగా భారీ బడ్జెట్ తో సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్ ను షూట్ చేస్తున్నారట….వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా కళ్యాణ్ రామ్ కోసం ఏకంగా….

8 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేస్తున్నారట. ఈ షూటింగ్ లో 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో ఏకంగా 30 రోజుల పాటు ఈ ఫైట్ సీన్ ను షూట్ చేస్తున్నారట. ఈ రేంజ్ బడ్జెట్ తో యాక్షన్ సీన్ అంటే రీసెంట్ టైంలో టాప్ స్టార్ మూవీస్ కి మాత్రమే జరగగా…

ఇప్పుడు వరుస ఫ్లాఫ్స్ లో కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కోసం ఈ రేంజ్ లో బడ్జెట్ తో యాక్షన్ సీన్ ను చేస్తూ ఉండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను కుదిరితే ఈ ఇయర్ ఎండ్ లో రిలీజ్ చేయబోతున్నారట. మరి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎంతవరకు కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

Devil-The British Secret Agent 5 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here