Home న్యూస్ 6CR అనుకుంటే 8వ రోజు ఊచకోత….8 డేస్ AP-TG కల్కి టోటల్ కలెక్షన్స్!

6CR అనుకుంటే 8వ రోజు ఊచకోత….8 డేస్ AP-TG కల్కి టోటల్ కలెక్షన్స్!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా అన్ని చోట్లా మరోసారి మాస్ రాంపెజ్ ను చూపించడానికి సిద్ధం అవుతూ ఉండగా….

8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకుంది…ఆంధ్రప్రదేశ్ లో సినిమాకి కాలేజ్ లు బంద్ కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని సొంతం చేసుకోగా నైజాంలో కూడా సినిమా కి మంచి గ్రోత్ సొంతం అయ్యింది…

మొత్తం మీద 8వ రోజు 7వ రోజు లెవల్ లో కలెక్షన్స్ రావడం ఖాయం అనుకోగా 6 కోట్లు ఆ పైన కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా కూడా సినిమా మొత్తం మీద అంచనాలు మించి పోయి 7 కోట్ల మార్క్ ని కూడా దాటేసి ఏకంగా 7.52 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది…

ఒకసారి సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD Day 8 AP TG Collections(Inc GST)
👉Nizam: 4.05Cr
👉Ceeded: 80L
👉UA: 80L
👉East: 48L
👉West: 38L
👉Guntur: 36L
👉Krishna: 44L
👉Nellore: 21L
AP-TG Total:- 7.52CR(11.50CR~ Gross)

8వ రోజు అంచనాలను మించి వసూళ్ళని అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో 142.84 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక గ్రాస్ పరంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా…

221.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 168 కోట్ల రేంజ్ లో ఉండగా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 25.16 కోట్ల షేర్ ని అందుకుంటే బిజినెస్ ను టచ్ చేస్తుంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here