బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన కేసరి సినిమా సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకోగా టోటల్ రన్ లో అంచనాలను మించి 154 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది…అలాంటి సినిమాకి సీక్వెల్ గా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన…
లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి పార్ట్ కి మించి మంచి రివ్యూలు సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా మరింత జోరు చూపెడుతుంది అనుకున్నా కూడా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోతున్న ఈ సినిమా…
మొదటి వారంలో అతి కష్టం మీద 46 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా 8వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఇప్పడు అతి కష్టం మీద 50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…
154 కోట్ల సినిమాకి సీక్వెల్, సూపర్ హిట్ రివ్యూలు వచ్చినా కూడా అతి కష్టం మీద 8 రోజుల్లో 50 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకోగా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే టోటల్ గా 140 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని…
అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా రెండో వీకెండ్ లో కొంచం ట్రెండ్ ను చూపెడుతున్నా కూడా పెద్దగా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ అయితే కనిపించడం లేదు. మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపించగలుగుతుందో చూడాలి ఇప్పుడు.