Home న్యూస్ 8 డేస్ మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ కలెక్షన్స్….బానే వచ్చాయి!!

8 డేస్ మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ కలెక్షన్స్….బానే వచ్చాయి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో హాలీవుడ్ నుండి మంచి అంచనాల నడుమ ఇండియాలో రిలీజ్ అయిన  మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్(Mission Impossible: The Final Reckoning) సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా సినిమాకి మంచి రెస్పాన్స్ సొంతం అయినా కూడా కలెక్షన్స్ షార్ట్ వీకెండ్ లో కుమ్మేసినా కూడా….

తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా…ఓవరాల్ గా సినిమా మొదటి 2 రోజుల వీకెండ్ లో 34 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా…

మూడో రోజు 5.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని 4వ రోజు 5.75 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, 5వ రోజున 4.75 కోట్లు, 6వ రోజున 4.65 కోట్లు, 7వ రోజున 3.9 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇక 8వ రోజున తిరిగి గ్రోత్ ని చూపించిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…

8 రోజులు పూర్తి అయ్యే టైంకి 68.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని మొదటి వారంలో ఓవరాల్ గా బాగానే కుమ్మేసింది అని చెప్పాలి. ఇక సినిమా ఇండియాలో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 100 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ఇక సినిమా ఈ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో 9-10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన రన్ లో మరో 24 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే ఇండియాలో సినిమా క్లీన్ హిట్ అవుతుంది. 

ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో 2.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది. మొత్తం మీద సినిమా లాంగ్ రన్ లో ఇండియాలో హిట్ అవ్వొచ్చు కానీ సినిమా మీద ఉన్న హైప్ కి తగ్గ కలెక్షన్స్ ని అయితే అందుకోలేక పోయింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here