బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎలాగోలా పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించిన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా టార్గెట్ లో సగం రికవరీని అయితే దాటింది కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా చాలా కష్టపడాల్సిన అవసరంతో రెండో వీక్ ని మొదలు పెట్టింది…
8వ రోజున సినిమా మరోసారి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తమిళనాడులో మాత్రం కొంచం పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన చోట్ల డ్రాప్స్ కంటిన్యూ అవుతూనే ఉండగా 100 కోట్ల మార్క్ ని అందుకోవాలి అన్నా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది.
తెలుగు లో సినిమా 8 రోజుల్లో 3.51 కోట్ల షేర్ ని అందుకోగా 10.50 కోట్ల టార్గెట్ కి ఇంకా 7 కోట్ల లోపు దూరంలో ఉంది. ఇక సినిమా 8వ రోజున వరల్డ్ వైడ్ గా 2.55 కోట్ల గ్రాస్ ను 1.3 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు ఓవరాల్ గా 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Suriya RETRO Movie 8 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 43.20Cr
👉Telugu States – 7.20Cr
👉Karnataka – 10.55Cr
👉Kerala – 4.30Cr
👉Hindi+ROI – 1.35Cr
👉Overseas – 22.10Cr***approx
Total WW collection – 88.70CR(44.40CR~ Share) Approx
(54% Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ కోసం ఇంకా 37.60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఈ వీకెండ్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.