మొదటి వారంలో వీకెండ్ మినహా మిగిలిన రోజుల్లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన ఆదిపురుష్(AdiPurush) సినిమా ప్రభాస్(Prabhas) కెరీర్ లో మరో భారీ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగానే నిలిచింది కానీ తర్వాత మాత్రం హోల్డ్ చేయలేక పోయింది.
ఇక రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెర్సెంటేజ్ బేస్ మీద రన్ అవుతూ ఉండగా 8వ రోజు కూడా అనుకున్న రేంజ్ లోనే డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే…
సినిమా 65 లక్షల దాకా షేర్ ని 8వ రోజు అందుకోగా కొంచం గ్రోత్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే 1.78 కోట్ల దాకా షేర్ ని సినిమా సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా…
8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 34.49Cr
👉Ceeded: 9.13CR
👉UA: 9.76Cr
👉East: 5.72Cr
👉West: 4.06Cr
👉Guntur: 6.43Cr
👉Krishna: 4.21Cr
👉Nellore: 2.12Cr
AP-TG Total:- 75.92CR(121.55Cr~ Gross)
👉Karnataka: 11.82Cr
👉Tamilnadu: 2.34Cr
👉Kerala: 0.84Cr
👉Hindi+ROI: 65.35Cr~
👉OS – 23.60Cr~
Total WW: 179.87CR(363.00CR~ Gross)
మొత్తం మీద 8వ రోజు చిన్నదే అయితే కొంచం గ్రోత్ ఉండటంతో శని ఆదివారాల్లో సినిమా కొంచం గ్రోత్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 242 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 62.13 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.