బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ రెండో వారంలో అడుగు పెట్టగా… సినిమా ఇప్పుడు రెండో వారం మొదటి రోజున హోళీ హాలిడే కలిసి రావడం వలన కొద్ది వరకు గ్రోత్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజున మొత్తం మీద 32 లక్షల షేర్ ని అందుకోగా ఇప్పుడు….
8 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర హోళీ అడ్వాంటేజ్ వలన సినిమా కొద్ది వరకు గ్రోత్ ని సొంతం చేసుకుంది కానీ థియేటర్స్ కౌంట్ కూడా తగ్గింది, మొత్తం మీద 15-20% వరకు గ్రోత్ అయితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇప్పుడు బాగుంటే…
సినిమా ఇప్పుడు 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది కానీ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక హిందీ లో స్క్రీన్ కౌంట్ మరింత తగ్గడంతో అక్కడ కలెక్షన్స్ ఇంకా తగ్గడం ఖాయం… మొత్తం మీద వర్కింగ్ డేస్ లో ప్రతీ రోజూ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం కొంచం గ్రోత్ ని అయితే సినిమా సొంతం చేసుకుంది…