బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఓవరాల్ గా ఫెంటాస్టిక్ కలెక్షన్స్ తో ముగించింది ఆర్ ఆర్ ఆర్ మూవీ, తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా హిందీ లో తర్వాత బెస్ట్ గా నిలిచింది, ఇక మిగిలిన చోట్ల కూడా దుమ్ము లేపిన సినిమా మొత్తం మీద మొదటి వారాన్ని సాలిడ్ కలెక్షన్స్ తో ముగించిన తర్వాత ఇప్పుడు రెండో వారం లో అడుగు పెట్టింది అని చెప్పాలి…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజులో అడుగు పెట్టగా రెండు తెలుగు రాష్ట్రాలలో మరో వర్కింగ్ డే నే అవ్వడంతో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో సినిమా 15-20% వరకు డ్రాప్స్ కనిపించగా ఈవినింగ్ షోల బుకింగ్స్ మాత్రం…
పుంజుకుంటూ దూసుకు పోతున్నాయి, రేపు ఉగాది హాలిడే కాబట్టి ఈవినింగ్ షోల నుండి సినిమాకి గ్రోత్ బాగుంటే అవకాశం ఎంతైనా ఉండగా ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ షోల గ్రోత్ ను బట్టి ముందుకు ఎంతవరకు వెళుతుందో చూడాలి.
ఇక హిందీ లో మరోసారి బాగా హోల్డ్ చేసిన సినిమా ఈ రోజు 9.5 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటకలో థియేటర్స్ చాలా తగ్గిపోగా తమిళనాడులో మాత్రం బాగా హోల్డ్ చేసింది సినిమా, టోటల్ గా ఈ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి ఇండియాలో 15-16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…
ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా మరోసారి 18 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి ఓవరాల్ గా ఎంతవరకు గ్రోత్ ని సినిమా చూపెట్టి కలెక్షన్స్ విషయంలో జోరు చూపిస్తుందో చూడాలి… డే ఎండ్ అయ్యే టైం కి మరోసారి బుకింగ్స్ ని చూసి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందో అప్ డేట్ చేస్తాం…