బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి ఊచకోత కోసింది, సినిమా అనుకున్న రేంజ్ ని మించి వసూళ్ళ ని సాధించి టాలీవుడ్ చరిత్ర లో 8 వ రోజు ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. సినిమా 7 వ రోజు తో పోల్చితే డ్రాప్స్ గట్టిగానే ఉన్నా…
తిరిగి తేరుకున్న సినిమా నైజాం, సీడెడ్ మరియు వైజాగ్ ఏరియాల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది, డానికి తోడు సినిమా కి నైజాం ఏరియా లో రెండో వీకెండ్ హైర్స్ రూపం లో 53 లక్షలు దక్కగా అవి 8 వ రోజు నైజాం కలెక్షన్స్ లో కలిశాయి.
దాంతో సినిమా నైజాం లో 2.48 కోట్లు, సీడెడ్ లో 1.15 కోట్లు, వైజాగ్ లో 1.1 కోట్ల రేంజ్ వసూళ్ళ ని సాధించింది, పార్శియల్ హాలిడే ఉండటం తో ముఖ్యంగా నైజాం ఏరియా లో సైరా కి అడ్డు లేకుండా పోయింది. సినిమా మొత్తం మీద 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
?Nizam: 2.48Cr(53L Hires)
?Ceeded: 1.15Cr
?UA: 1.10Cr
?East: 27L
?West: 14L
?Guntur: 35L
?Krishna:27L
?Nellore: 14L
AP-TG Day 8:- 5.91Cr ఇదీ మొత్తం మీద 8 వ రోజు సినిమా సాధించిన కలెక్షన్స్…
సినిమా జోరు బాగున్నా టికెట్ రేట్లు తగ్గడం తో మరీ ఎక్కువ రాదు అనుకున్నా అది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో హెల్ప్ అయ్యి సినిమా 4 నుండి 4.5 కోట్లు వస్తాయి అనుకుంటే ఏకంగా 5.91 కోట్ల షేర్ ని సినిమా అందుకుని ఆల్ టైం 8 వ రోజు టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఇక టోటల్ 8 డేస్ కలెక్షన్స్ ని కొద్ది సేపట్లో అప్ డేట్ చేస్తాం.