మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 115 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసిన సైరా నరసింహా రెడ్డి ఇప్పుడు రెండో వారం లో అడుగు పెట్టింది, సినిమా యూనిట్ సినిమా ను ఎక్కువ మంది చూడాలి అని చాలా ఏరియాల్లో సినిమా టికెట్ హైక్స్ ని తొలగించి నార్మల్ టికెట్ రేట్ల కి తగ్గించారు. దాంతో గ్రోత్ బాగున్నా కలెక్షన్స్ లో ఎక్కువ గ్రోత్ కనిపించలేదు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 7 వ రోజు తో పోల్చితే 50% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికి తిరిగి గ్రోత్ ని సాధించిన సినిమా….
మొత్తం మీద 15% వరకు గ్రోత్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో చూపెట్టింది, దాంతో సినిమా డే 7 నుండి డే 8 డ్రాప్స్ 35% వరకు తగ్గాయి. దాంతో సినిమా మంచి గ్రోత్ తో దుమ్ము లేపే అవకాశం ఉన్నా టికెట్ రేట్లు తగ్గడం తో మరీ భీభత్సం కాకున్నా….
8 వ రోజు ఇప్పుడు 4 నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ అనుకున్నట్లు ఉంటె ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది, 8 వ రోజుకి గాను టాలీవుడ్ హిస్టరీ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ఇది అని చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 8 వ రోజున 5 కోట్ల నుండి 5.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని సమాచారం, మొత్తం మీద 8 వ రోజు సాలిడ్ గా నే ముగించబోతుంది సైరా సినిమా, ఇక అఫీషియల్ గా 8 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.