టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించుకుంది, సినిమా ఇప్పుడు రెండో వారం లో ఎంటర్ అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 800 వరకు థియేటర్స్ లో మిగిలిన చోట్ల ఇండియా లో 650 వరకు థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగిస్తుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు ఫుల్ హాలిడే అవ్వడం తో అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు విషయానికి వచ్చే సరికి పార్షిక సెలవు అవ్వడం తో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కి హాలిడే తో పోల్చకుండా చూస్తె…
మంచి ఓపెనింగ్స్ దక్కుతున్నాయి అని చెప్పాలి కానీ 7 వ రోజు తో కంపేర్ చేసి చూస్తె మాత్రం 8 వ రోజు మొదటి 2 షోలకు ఆల్ మోస్ట్ 45% టు 50% వరకు డ్రాప్స్ సినిమా కి దక్కాయి. దాంతో ఈ రోజు తొలి 2 షోలు కొంచం షాకింగ్ కలెక్షన్స్ తోనే ఓపెన్ అయ్యాయి అని చెప్పాలి.
కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మాత్రం సినిమా బుకింగ్స్ బాగున్నాయి, దాంతో ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి చూస్తె సినిమా 8 వ రోజు 4 కోట్ల లోపు రేంజ్ షేర్ ని అందుకోవచ్చు కానీ బుకింగ్స్ ఈవినింగ్ షోల కి బాగున్నాయి కాబట్టి మొత్తం మీద
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటె సినిమా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక మిగిలిన చోట్ల సినిమా పరుగు ఆల్ మోస్ట్ స్లో డౌన్ అవ్వగా ఒక్క కర్ణాటక లోనే బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. మొత్తం మీద రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.