బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా మరోసారి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ ని కొనసాగిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల వలన సినిమా కొంచం స్లో డౌన్ అవ్వగా హిందీ లో మాత్రం మంచి జోరుని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది, అలాగే ఓవర్సీస్ లో కూడా సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…
1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా హిందీలో ఈ రోజు 7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ కేరళ మరియు ఓవర్సీస్ లో ఓవరాల్ గా సినిమా 5 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది.
దాంతో ఓవరాల్ గా సినిమా 8వ రోజు వరల్డ్ వైడ్ గా 7 కోట్ల రేంజ్ నుండి 7.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.