మొదటి వారాన్ని ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని సాలిడ్ రికవరీని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల నుండి పోటిని కూడా…
ఫేస్ చేస్తూ ఉండటంతో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే హోల్డ్ చేస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల ఆవల మాత్రం ఇప్పుడు విజయ్ గోట్ మూవీ వలన స్క్రీన్ భారీగా తగ్గగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగిస్తుంది…
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజుతో పోల్చితే కొంచం తక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఇప్పుడు 8వ రోజున అటూ ఇటూగా 55-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు ఓవర్సీస్ లో ఉన్న థియేటర్స్ లో పర్వాలేదు అనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 85-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…
కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఉన్నంతలో మరోసారి 8వ రోజు పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తున్న సినిమా నైట్ షోలకు గ్రోత్ ని చూపిస్తే షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక టోటల్ గా సినిమా 8 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.