నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా మొదటి వారాన్ని ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా ఉన్నంతలో మరోసారి పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో పరుగును స్టడీగా కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 7వ రోజుతో పోల్చితే ఇప్పుడు 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో…
మొత్తం మీద 35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. సీడెడ్ లో ఆంధ్రలో సినిమా మరోసారి మంచి హోల్డ్ ని చూపించగా నైజాంలో కూడా సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 8వ రోజున ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే వీర సింహా రెడ్డి సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
2.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్ లెక్కలు బాగుంటే కొంచం ఎక్కువ ఉండొచ్చు… ఓవరాల్ గా సినిమా 2.5 కోట్ల మార్క్ ని దాటేస్తే మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక టోటల్ గా సినిమా 8 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.