మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మగధీర తర్వాత అలాంటి హిట్ దక్కలేదు, కొన్ని సినిమాలు హిట్ అయినా 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేదు, అలాంటి టైం లో ఇండియా మొత్తం డీ మానిటైజేషన్ ఇంపాక్ట్ పడినప్పుడు పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కి సిద్ధం కాని టైం లో టాలీవుడ్ కి అన్ సీజన్ గా భావించే డిసెంబర్ నెలలో బాక్స్ అఫీస్ బరిలోకి దిగిన ధృవ సినిమా…
మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, తమిళ్ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ సినిమా తెలుగు రీమేక్ గా తెరకక్కిన ఈ సినిమా కోసం ఆ టైం లో 50 కోట్ల రేంజ్ బడ్జెట్ ని పెట్టగా సినిమా కి థియేట్రికల్ బిజినెస్ 57 కోట్లు అవ్వగా…
సినిమా టోటల్ రన్ లో 58.15 కోట్ల షేర్ ని అందుకుని హిట్ గా నిలిచింది, ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ 8.5 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ 4.5 కోట్లు సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ OTT రైట్స్ కింద 1 కోటి దాకా సొంతం చేసుకుంది… దాంతో ఓవరాల్ గా సినిమా…
అన్నీ కలుపుకుని 71 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది, అంటే బడ్జెట్ మీద పబ్లిసిటీ ఖర్చులు తీసేసినా ఓవరాల్ గా 26-28 కోట్ల రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుంది, రీసెంట్ గా సినిమా రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు పూర్తి చేసుకుంది. నార్మల్ టైం లో రిలీజ్ అయ్యి ఉంటె ఈజీగా 60 నుండి 65 కోట్ల దాకా షేర్ ని అందుకుని ఉండేది ఈ సినిమా..
కానీ అప్పటి డీమానిటైజేషన్ టైంలో కూడా డిసెంబర్ నెలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని జోరు చూపించింది…ఈ సినిమాతో ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని అందుకున్నాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమా తర్వాత చేసిన రంగస్థలంతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు…