Home న్యూస్ ఈ 2 రోజులు చాలా కీలకం…లేకపోతే ఇక అంతే!!

ఈ 2 రోజులు చాలా కీలకం…లేకపోతే ఇక అంతే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) సినిమా మొదటి వీక్ ని పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా…

మొదటి వారంతో పోల్చితే రెండో వారంలో థియేటర్స్ కౌంట్ 60% రేంజ్ లో డ్రాప్ అవ్వగా ఉన్న థియేటర్స్ లో 8వ రోజు సినిమా కలెక్షన్స్ తీవ్రంగా నిరాశ పరిచే విధంగా ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక వీకెండ్ లో శని, ఆదివారాలు….

చాలా అంటే చాలా కీలకం అని చెప్పాలి ఇప్పుడు. ఈ రెండు రోజుల్లో సాధించే కలెక్షన్స్ తోనే నష్టాలు తగ్గించుకునే అవకాశం 35 కోట్ల నుండి 30 కోట్ల లోపుకి చేరుకునే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సినిమా ప్రజెంట్ ను చూస్తూ ఉంటే సినిమా ఈ మార్క్ ని తగ్గించుకోవడం…

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కష్టంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా కి మరీ భారీ నెగటివ్ టాక్ ఏమి లేదు, యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ఉంది, పోటిలో ఎలాంటి సినిమాలు కూడా ఏమి లేవు. అయినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ ని చూపించడం లేదు…

ఈ శని, ఆదివారాల్లో సినిమా ఇప్పుడు హోల్డ్ ని భారీ లెవల్ లో చూపించి మినిమం 5-6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే కొంచం లాంగ్ రన్ ఉండొచ్చు కానీ సినిమా ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే అది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. ఈ రెండు రోజుల్లో సినిమా గ్రోత్ చూపించకపోతే ఎపిక్ డిసాస్టర్ గా నిలవడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here