Home న్యూస్ 9.6 ఏంటి సామి….రికార్డ్ కొట్టిన సూర్య “జై భీమ్”!!

9.6 ఏంటి సామి….రికార్డ్ కొట్టిన సూర్య “జై భీమ్”!!

3389
0

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ జై భీమ్ రిలీజ్ అవ్వడం మరీ హైప్ తో అయితే రిలీజ్ కాలేదు కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మాత్రం మరో లెవల్ లో సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది ఈ సినిమా, తమిళ్ లో కొంచం బజ్ ఉన్నప్పటికీ కూడా తెలుగు లో మాత్రం చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా…

సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ డిజిటల్ లో అమెజాన్ ప్రైమ్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన సూర్య నటించిన సూరరై పోట్రు సినిమా తర్వాత అన్ని భాషల్లో కలిపి హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఇప్పటికీ…

ప్రైమ్ వీడియోలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీ డాటా బేస్ అయిన IMDB లో అత్యధిక రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాగా కూడా నిలిచి సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతుంది, సినిమా కి అక్కడ యూసర్ రేటింగ్ లు మరో లెవల్ లో ఉన్నాయి.

ఆల్ మోస్ట్ 53 వేల మంది యూసర్స్ అక్కడ సినిమాను రేట్ చేయగా యూసర్ రేటింగ్ 9.6 వరకు ఉంది. ఈ రేంజ్ రేటింగ్ అంటే అది భీభత్సమ్ అనే చెప్పాలి, అతి కొద్ది సినిమాలకు మాత్రమే ఇలాంటి రేటింగ్ సొంతం అవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి సినిమాలలో ఒకటిగా నిలుస్తూ జై భీమ్ సినిమా ఓవరాల్ గా IMDB లో ఆల్ టైం…

హైయెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న టాప్ 250 సినిమాల జాబితాలో కూడా ఒకటిగా ఎంటర్ అయ్యింది జై భీమ్ సినిమా, ఈ రేంజ్ రేటింగ్ తో దూసుకు పోవడం అంటే ఇది సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి. ఇంకా లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుందో చూడాలి, డిజిటల్ లో మరో సూపర్ డూపర్ హిట్ ను సూర్య తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here