జెర్సీ తర్వాత నాని నటించిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ అంచనాలను అందుకోలేదు, తర్వాత చేసిన వి ది మూవీ కానీ, టక్ జగదీష్ కానీ ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ అలా జరగలేదు, దాంతో డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సి రాగా నాని మీద లెక్కకు మిక్కిలి ప్రెజర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా తొలిరోజే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో కుమ్మేసే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయ్యి మొదటి వారం తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా సినిమా రెండో వారంలో న్యూ ఇయర్ అడ్వాంటేజ్ లభించడంతో…
ఆ అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో వాడుకున్న సినిమా ఏకంగా 1.98 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము దులిపేసి, ఇప్పుడు 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని నానికి సాలిడ్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది.
మొత్తం మీద సినిమా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.69Cr
👉Ceeded: 2.37Cr
👉UA: 1.96Cr
👉East: 95L
👉West: 74L
👉Guntur: 1.05Cr
👉Krishna: 84L
👉Nellore: 57L
AP-TG Total:- 17.17CR(29.13CR~ Gross)
Ka+ROI: 2.71Cr
OS – 3.45Cr
Total WW: 23.33CR(40.50CR~ Gross)
ఇదీ సినిమా 9 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను 22 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 22.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 83 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా సంక్రాంతి వచ్చే వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో జోరు చూపెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.