టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి ఇక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంది, కాగా అక్కడ 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 తో ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించాడు. దాంతో అక్కడ మెగాస్టార్ కి ఉన్న క్రేజ్ పవర్ ఏంటో క్లియర్ గా తేటతెల్లం అయింది అని చెప్పొచ్చు.
ఆ క్రేజ్ తోనే మెగాస్టార్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా ని అక్కడ అన్ని వర్షన్స్ కలుపుకుని ఆల్ టైం రికార్డ్ రేంజ్ లో ఏకంగా 26.25 కోట్లకు అమ్మారు. దానికి తగ్గట్లే మెగాస్టార్ అక్కడి కి స్వయంగా వెళ్లి ప్రమోషన్ పనులు కూడా చూసుకున్నాడు. దాంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా…
ఇప్పటి వరకు సినిమా అక్కడ సాధించిన షేర్ 13.02 కోట్లు మాత్రమె అయింది. అందులో తెలుగు వర్షన్ ఎంత అనేది క్లియర్ గా చెప్పకున్నా 80% కి పైగా రెవెన్యూ తెలుగు వర్షన్ ద్వారానే వచ్చినట్లు సమాచారం. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కీలక రోల్ చేసినా కానీ…
రీసెంట్ టైం లో అక్కడ ఇతర భాషల సినిమాల వల్ల లోకల్ మూవీస్ కి ఎదురుదెబ్బ కొడుతుంది అని థియేటర్స్ కేటాయించే విషయం లో కానీ షోల విషయం లో కానీ చాలా కచ్చితంగా వ్యవహిరిస్తున్నారు. అది కొంచం ఎఫెక్ట్ చూపినా అందులో కన్నడ స్టార్ హీరో కూడా ఉన్నా కానీ…సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సగం వరకు మాత్రమె…
రికవరీ చేయడం తో ఇక్కడ లాస్ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయినట్లే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఏదైనా అద్బుతం జరిగి సెకెండ్ వీకెండ్ శని ఆది వారాలలో అక్కడ మళ్ళీ మొదటి వీకెండ్ లెవల్ లో పెర్ఫార్మ్ చేసినా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టమే అని అంటున్నారు. దాంతో ఇక్కడ లాస్ కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుండే రికవరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.