పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా రెండో వారంకి వచ్చే సరికి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఓ రేంజ్ లో పెరిగి పోయి మరింత దెబ్బ కొట్టేసింది. అయినా కానీ ఒక పక్క కొత్త సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయిన పరిస్థితి ఉండగా వకీల్ సాబ్ మాత్రం…
జనాలను థియేటర్స్ కి రప్పిస్తుంది, సినిమా 8 వ రోజు గట్టి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 9 వ రోజు కూడా డ్రాప్స్ గట్టిగానే కనిపించడం తో ఇక 8 వ రోజు కన్నా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు అనుకున్నా గ్రోత్ ని చూపెట్టింది ఈ సినిమా…
1 కోటి కి పైగా షేర్ అనుకుంటే సినిమా 1.32 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు సొంతం చేసుకుని ఇప్పుడు 10 వ రోజు పై మరింత ఆశలు పెరిగేలా చేసింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 23.79Cr (inc.GST)
👉Ceeded: 12.32Cr
👉UA: 11.21Cr (inc.GST)
👉East: 6.09Cr (inc.GST)
👉West: 6.61Cr (inc.GST)
👉Guntur: 6.79Cr (inc.GST)
👉Krishna: 4.69Cr (inc.GST)
👉Nellore: 3.22Cr
AP-TG Total:- 74.72CR (114.9Cr Gross~)
KA+ROI – 3.59Cr (Corrected)
OS- 3.70Cr (Corrected)
Total WW: 82.01CR(130.50CR Gross)
ఇదీ సినిమా 9 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. సినిమా మొత్తం మీద 82 కోట్ల మార్క్ ని అందుకోగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 90 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9 రోజుల తర్వాత మరో 7.99 కోట్ల షేర్ ని సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటుంది. ఇక ఆదివారం రోజున రెట్టించిన జోరు తో కలెక్షన్స్ ని సాధిస్తే బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సినిమా 10 వ రోజు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి..