Home న్యూస్ చరిత్రకెక్కే ఇండియన్ రికార్డ్ ఇది….9 సార్లు 100 కోట్లు కొట్టిన ఒకే ఒక్క డైరెక్టర్!!

చరిత్రకెక్కే ఇండియన్ రికార్డ్ ఇది….9 సార్లు 100 కోట్లు కొట్టిన ఒకే ఒక్క డైరెక్టర్!!

3136
0

ఇండియా వైడ్ గా క్రేజీ డైరెక్టర్స్ ఎంతో మంది ఉన్నారు, ఒక్క సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని మ్యాజిక్ చేయగల సత్తా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి ఒక్క సినిమాతోనే వందల కోట్ల కలెక్షన్స్ ని అందుకునే వాళ్ళు కూడా ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు అత్యధిక సార్లు 100 కోట్ల మార్క్ ని అందుకున్న…

ఒకే ఒక్క డైరెక్టర్ గా బాలీవుడ్ యాక్షన్ మూవీస్ అండ్ కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ అయిన రోహిత్ శెట్టి అందరి కన్నా ముందు నిలిచాడు అనే చెప్పాలి…. గోల్ మాల్ సిరీస్ తో కామెడీ హిట్స్ కొట్టిన రోహిత్ శెట్టి సింగం సిరీస్ తో మాస్ హిట్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు.

లేటెస్ట్ గా రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన సూర్యవంశీ సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకోగా తన కెరీర్ లో 9 వ సారి 100 కోట్ల మార్క్ ని అందుకుని ఇండియాలో మరే డైరెక్టర్ కూడా దరిదాపుల్లో లేని రికార్డ్ ను సొంతం చేసుకుని దూసుకు పోతున్నాడు రోహిత్ శెట్టి.

రోహిత్ శెట్టి కెరీర్ లో గోల్ మాల్ 3 106.3 కోట్లు వసూల్ చేయగా తర్వాత సింగం 100 కోట్ల మార్క్ ని అందుకుంది, తర్వాత బోల్ బచ్చన్ 102 కోట్ల మార్క్ ని, చెన్నై ఎక్స్ ప్రెస్ 227 కోట్ల మార్క్ ని, సింగం రిటర్న్స్ 141 కోట్ల మార్క్ ని దిల్ వాలే 148 కోట్ల మార్క్ ని గోల్ మాల్ అగైన్ 206 కోట్ల మార్క్ సింబా 241 కోట్ల మార్క్ ని…

అందుకోగా ఇప్పుడు సూర్యవంశీ 7 రోజుల్లో 120 కోట్లతో దుమ్ము లేపుతుంది. ఇలా ఇన్ని సార్లు 100 కోట్ల మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క ఇండియన్ డైరెక్టర్ గా నిలిచిన రోహిత్ శెట్టి బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా దూసుకు పోతున్నాడు. ఇక్కడ మరో రికార్డ్ ఏంటంటే గోల్ మాల్ 3 నుండి వరుసగా అన్ని సినిమాలు 100 కోట్ల మార్క్ ని అందుకోవడం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here