బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ జాతర ని కొనసాగిస్తున్న అఖండ సినిమా ఇప్పుడు రెండో వారాన్ని పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ కాబోతుండగా సినిమా 14 వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గానే హోల్డ్ చేసి దుమ్ము లేపింది అని చెప్పాలి. సినిమా 14 వ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 1-1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా….
సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 1.3 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 90 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుండగా టోటల్ వరల్డ్ వైడ్…
గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 112 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది అని చెప్పాలి. సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ రాంపేజ్ చూపెట్టిన సినిమా మూడో వారంలో పుష్ప నుండి భారీ పోటిని ఎదురుకోబోతుంది. మరి సినిమా కి ఎన్ని థియేటర్స్ ఉంటాయి అన్నది ఆసక్తిగా మారగా టోటల్ గా 2 వారాల కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.