కొన్ని కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ పాజిటివ్ గా ఉన్నా టెలివిజన్ లో మాత్రం పూర్ వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకుంటాయి… కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ బుల్లి తెరపై సూపర్ హిట్ అవుతాయి. లేటెస్ట్ గా ఈ కోవలోకి వినయ విధేయ రామ సినిమా అల్టిమేట్ స్మాల్ స్క్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఆ రేంజ్ లో కాకున్నా కానీ…
చిన్న సినిమా అయిన 90ML మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్నా కానీ బుల్లి తెరపై మాత్రం మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, సినిమా పలు సార్లు టెలికాస్ట్ అయిన టైం ఎఫెక్ట్ చూపగా…
ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుంది, అలా సినిమా ఇప్పటి వరకు 6 సార్లు టెలికాస్ట్ అవ్వగా అన్ని సార్లు కలిపి చూస్తె మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుని టెలివిజన్ లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.1 కోట్ల రేంజ్ షేర్ నే అందుకున్నా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 10.9 రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది, తర్వాత నుండి కంటిన్యుగా 4-5 రేంజ్ రేటింగ్ ని ప్రతీ సారి సాధిస్తూ వచ్చి రేటు ప్రకారం చూసుకుంటే సెన్సేషనల్ విక్టరీ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.
సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్ల TRP రేటింగ్స్ ని ఒకసారి గమనిస్తే…
👉1st Time: 10.90 TRP
👉2nd Time: 5.07 TRP
👉3rd Time: 3.64 TRP
👉4th Time: 3.88 TRP
👉5th Time: 4.13 TRP
👉6th Time: 3.56 TRP**
ఇలా సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు మంచి రేటింగ్స్ తో దుమ్ము లేపింది…