బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ మాస్ రచ్చ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, ఇండియన్ మూవీస్ పరంగా చరిత్రలో నిలిచి పోయే రేంజ్ లో జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా మొదటి వీకెండ్ లోనే…
రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన పుష్ప2 మూవీ 4 రోజుల వీకెండ్ లోనే ఏకంగా 800 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు 5వ రోజు వర్కింగ్ డే లో మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేయగా మేజర్ కలెక్షన్స్ అన్నీ కూడా హిందీ మార్కెట్ నుండే సొంతం చేసుకోగా…
అక్కడ రికార్డుల రాంపెజ్ మరో లెవల్ లో ఉండగా మొత్తం మీద 5 రోజుల్లో ఓవరాల్ గా 885 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు ఇండియన్ మూవీస్ పరంగా మరో బిగ్గెస్ట్ రికార్డ్ ను కూడా నమోదు చేసి మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…
ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం ఫాస్టెస్ట్ 900 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది….6 వ రోజు సగం రోజు గడవక ముందే ఇప్పుడు పుష్ప2 900 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది…ఇది వరకు ఇండియన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన బాహుబలి2 మూవీ…
9 రోజుల టైంకి 900 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…కాగా ఈ ఫాస్టెస్ట్ 900 కోట్ల రికార్డ్ ఆల్ మోస్ట్ ఏడున్నర ఏళ్ళుగా అలానే ఉండగా ఎట్టకేలకు ఇప్పుడు ఈ రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ ఐదున్నర రోజుల లోపే ఈ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక 1000 కోట్ల మమ్మోత్ మార్క్ ని ఎంత త్వరగా అందుకుంటుందో చూడాలి.