90 కోట్ల బడ్జెట్…4000 థియేటర్స్ లో రిలీజ్…రిజల్ట్ మాత్రం డిసాస్టర్!!

0
1156

  మన బాహుబలి సక్సెస్ ని చూసి బాలీవుడ్ వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద సెట్స్ తో ఎమోషనల్ కథలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు విరగబడి థియేటర్స్ కి వస్తారు అనుకుని చేస్తున్న ప్రయత్నాలు మొత్తం తిరగ బడుతున్నాయి. లాస్ట్ ఇయర్ తగ్స్ ఆఫ్ హిందోస్తాన్ అలాగే దెబ్బ పడగా ఇప్పుడు లేటెస్ట్ గా కరణ్ జోహార్ నిర్మించిన “కలంక్” మూవీ భారీ డిసాస్టర్ గా మిగిలి పోనుంది. సినిమాను ఏకంగా 90 కోట్ల రేంజ్ బడ్జెట్ తో భారీ సెట్టింగ్స్ తో…

అత్యంత భారీ గా తెరకేక్కించగా ఎమోషనల్ డ్రామా గా చెప్పుకున్న ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు ఏకంగా రికార్డ్ లెవల్ లో 4000 వరకు థియేటర్స్ లో రాగా తొలిరోజు తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా బజ్ పరంగా తొలిరోజు 21 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకున్నా…తర్వాత

మాత్రం పూర్తిగా స్లో డౌన్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 40 కోట్ల షేర్ ని కూడా అందుకోలేదట. బిజినెస్ 80 కోట్లు అవ్వడం తో 150 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రావాల్సి ఉందట. ప్రస్తుతానికి 60 కోట్లకు పైగానే రావడం తో భారీ నష్టాలు తప్పవని అంటున్నారు. అవసరం లేకున్నా భారీ హంగులకు పోయి మరో సినిమా డిసాస్టర్ అయ్యింది అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!