యూత్ స్టార్ నితిన్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ ని ఎదురు కున్నా కానీ లేటెస్ట్ గా అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు నితిన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తో రెట్టించిన జోరు తో సినిమా లు చేస్తున్నాడు యూత్ స్టార్…
ముందుగా రంగ్ దే సినిమా తో లాక్ డౌన్ తర్వాత ఆడియన్స్ ముందుకు రానున్న నితిన్ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ అంధధూన్ తెలుగు రీమేక్ లో నటించ బోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అసలు సిసలు బిగ్గెస్ట్ మూవీ ని చేయబోతున్నాడు నితిన్.
తన కెరీర్ లోనే ఇప్పటి వరకు ఏ సినిమా కి పెట్టనంత బడ్జెట్ తో పాన్ ఇండియా లో లెవల్ లో భారీ ఎత్తున సినిమా చేయబోతున్నాడు, 2 పార్టులుగా తెరకెక్క బోతున్న ఈ సినిమా టైటిల్ పవర్ పేట అని అంటున్నారు, చల్ మోహన్ రంగ డైరెక్టర్ చైతన్య ఈ సినిమా కి డైరెక్టర్ కాగా…
రంగ్ దే సినిమాలో నితిన్ తో కలిసి నటిస్తున్న కీర్తి సురేష్ ఈ సినిమా లో మరో సారి నితిన్ కి జోడి గా నటిస్తుంది, కాగా ఈ సినిమా బడ్జెట్ దాదాపు 90 కోట్ల రేంజ్ లో ఉండబోతుందని, రా కంటెంట్ తో మాస్ ఎలిమెంట్స్ తో చాలా రియలిస్టిక్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
90 కోట్ల రేంజ్ బడ్జెట్ అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. నితిన్ ఇది వరకు అ.ఆ తో ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ అందుకున్నాడు, ఇప్పుడు 90 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పవర్ పేట అంచనాలను అందుకుంటే మాస్ లో తన రేంజ్ ఓ లెవల్ లో పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరిగబోతుందని అంటున్నారు…