Home గాసిప్స్ 90 కోట్ల సినిమా….నితిన్ ట్రిపుల్ బొనంజా!!

90 కోట్ల సినిమా….నితిన్ ట్రిపుల్ బొనంజా!!

534
0

యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భీష్మ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే, అ ఆ తర్వాత వరుసగా వచ్చిన ఫ్లాఫ్స్ కి మంచి కంబ్యాక్ సొంతం చేసుకున్నాడు, అది కూడా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు, మంచి డేట్ చూసు కుని రిలీజ్ చేసి ఉంటె సినిమా 40 కోట్ల క్లబ్ లో చేరి ఉండేది.

Bheeshma 9 Days Total WW Collections

ఇక నితిన్ న్యూ మూవీస్ కమిట్ అయిన వాటిలో ఒక సినిమా మాత్రం అందరినీ ఆశగా ఎదురు చూసేలా చేస్తుంది, అదే పవర్ పేట. కోలివుడ్ లో ధనుష్ చేసిన వడా చెన్నై తరహా రా రస్టిక్ పక్కా లోకల్ కాన్సెప్ట్ తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా కి…

Bheeshma Total WorldWide Collections

నితిన్ తో ఇది వరకు చల్ మోహన్ రంగ సినిమా చేసిన కృష్ణ చైతన్య డైరెక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఏకంగా 90 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రెండు పార్టులుగా రూపొందబోతుందని సమాచారం. అలాగే ఇందులో నితిన్ మూడు డిఫెరెంట్ ఏజ్ గెటప్స్ లో కనిపిస్తాడట.

అందుకు గాను ఏకంగా హాలివుడ్ నుండి ప్రోస్తటిక్ మేకప్ మేన్ ని రప్పించుకునే పనిలో ఉన్నారట. 20 ఏళ్ల గెటప్, 40 ఏళ్ల గెటప్ అండ్ 60 ఏళ్ల గెటప్ ల కోసం డిఫెరెంట్ లుక్ ని ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. అ ఆ సినిమా తర్వాత భారీ బడ్జెట్ తో నితిన్ లై అనే సినిమా చేశాడు కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేదు.

మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ చేసిన తర్వాత భారీ బడ్జెట్ తో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో పవర్ పేట సినిమా తో రిస్క్ చేస్తున్నాడు నితిన్, ప్రస్తుతం రంగ్ దే షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా ఆ సినిమా అయిన వెంటనే ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకువెల్లబోతున్నారని సమాచారం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే నితిన్ రేంజ్ అమాంతం పెరిగి పోవడం ఖాయం…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here