Home గాసిప్స్ 90 కోట్ల సినిమా కి బ్రేక్…షాకిచ్చిన నితిన్ నిర్ణయం…కారణం ఇదే!

90 కోట్ల సినిమా కి బ్రేక్…షాకిచ్చిన నితిన్ నిర్ణయం…కారణం ఇదే!

3930
0

యూత్ స్టార్ నితిన్ లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ ను దక్కించుకున్నాడు. దాంతో రెట్టించిన జోరు తో వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ వచ్చిన నితిన్ అందులో భాగంగా ఓ భారీ ప్రాజెక్ట్ ను కూడా ఓకే చేశాడు. సుమారు 90 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రెండు పార్టులుగా…

ఈ సినిమా ఉండబోతుంది అంటూ చెప్పుకు రాగా ఇప్పుడు సడెన్ గా ఆ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడబోతుంది అని తెలుస్తుంది. వివరాల్లోకి వెలితే…. ప్రస్తుతం నితిన్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ చేసిన…

చెక్ మరియు రంగ్ దే సినిమాలు రెండూ కూడా ఆడియన్స్ ను అలరించడంలో విఫలం అయ్యాయి. దాంతో ఇప్పుడు తన ఆశలన్నీ కూడా అంధ దూన్ రీమేక్ మేస్ట్రో మీదే పెట్టుకున్న నితిన్ ఈ సినిమా తర్వాత 90 కోట్ల భారీ బడ్జెట్ తో చేయబోతున్న సినిమా పవర్ పేట చేయాల్సి ఉంది కానీ…

ఆ సినిమా పూర్తీ అయ్యేటప్పటికీ టైం ఎక్కువ అయ్యే అవకాశం ఉండటం, దానికి తోడూ ఓన్ బ్యానర్ కాబట్టి అంత బడ్జెట్ తో రిస్క్ చేయడానికి కొంచం ఎక్కువ టైం తీసుకోవాలని భావిస్తున్న నితిన్. ఈ సినిమా ప్లేస్ లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తో డైరెక్టర్ అయిన వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక ఎంటర్ టైనర్ మూవీ ని…

ఒప్పుకున్నాడని తెలుస్తుంది. దాంతో తన అప్ కమింగ్ 2 మూవీస్ రిజల్ట్ తర్వాత పరిస్థితుల నేపధ్యంలో ఆ భారీ మూవీ ని మొదలు పెట్టె ఆలోచన లో నితిన్ ఉన్నాడని అంటున్నారు. దాంతో 90 కోట్ల సినిమా కి ప్రజెంట్ బ్రేక్ పడటం అయితే ఖాయం అయ్యిందని ఇండస్ట్రీలో అంటున్నారు. ఇక నితిన్ నటించిన మేస్ట్రో ఆడియన్స్ ముందుకు జూన్ నెలలో రాబోతున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here