బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు 9 రోజులు పూర్తీ అయ్యే టైం కి సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క నైజాం ఏరియాలోనే ఇప్పుడు 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 90 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి దుమ్ము దుమారం లేపగా ఇక నైజాం ఏరియా విషయానికి వస్తే…
అక్కడ 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మరో సంచలన బెంచ్ మార్క్ ని నమోదు చేసింది, మొత్తం మీద సినిమా ఇటు నైజాం ఏరియా లోనే ఇటు సీడెడ్ ఏరియా లో కూడా ఈ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సినిమాగా సంచలనం సృష్టించింది ఆర్ ఆర్ ఆర్ మూవీ…
ఇప్పుడు లాంగ్ రన్ లో సినిమా నైజాం ఏరియాలో అవలీలగా 120 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సీడెడ్ ఏరియాలో 55 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని అంటున్నారు… మరి బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి రికార్డుల బెంచ్ మార్క్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి…చరిత్ర లో ఇలాంటి బెంచ్ మార్క్ లు అప్ ఇప్పుడు కొంత టైం వరకు ఆర్ ఆర్ ఆర్ పేరిటే నిలిచిపోవడం ఖాయమని చెప్పాలి.