మణిరత్నం ఎపిక్ మూవీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై తమిళనాడులో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కానీ మిగిలిన చోట్ల మాత్రం అనుకున్న రేంజ్ లో బజ్ ను సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తమిళ్ వర్షన్ మాత్రం సంచలనాలు సృష్టించడం…
ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక సినిమా రిలీజ్ రేంజ్ కూడా ఎక్స్ లెంట్ అనిపించే విధంగా ఉంది, సినిమా ఒక్క అమెరికాలోనే రికార్డ్ లెవల్ లోకేషన్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి..
కాగా సినిమా తమిళ్ వర్షన్ 490 లోకేషన్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా తెలుగు వర్షన్ 300 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కానుంది. ఇక హిందీ వర్షన్ 140 వరకు లోకేషన్స్ లో రిలీజ్ కానుండగా టోటల్ గా ఫైనల్ లెక్క 930 లోకేషన్స్ లో ఈ సినిమా ఇప్పుడు అమెరికాలో రిలీజ్ కానుంది.
ఫైనల్ లెక్క మరింత పెరిగే అవకాశం ఉండగా సినిమా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ ప్రీ టికెట్ సేల్స్ ద్వారా ఆల్ మోస్ట్ 700K డాలర్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. రిలీజ్ కి ఇంకా టైం ఉన్న నేపధ్యంలో తమిళ్ సినిమాల పరంగా ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడానికి ఈ సినిమాకి అవకాశం ఉందని అంటున్నారు.