Home న్యూస్ 95+…ఇదయ్యా పవర్ స్టార్ క్రేజ్ పవర్!!

95+…ఇదయ్యా పవర్ స్టార్ క్రేజ్ పవర్!!

1733
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీ ఎంట్రీ కి సిద్ధం అయిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటె సినిమా లాస్ట్ ఇయర్ సమ్మర్ కే రావాల్సి ఉన్నా కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఈ ఇయర్ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది, ఇక సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

టీసర్ కి ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు అద్బుతమైన రెస్పాన్స్ రాగా యూట్యూబ్ లో స్టార్ట్ అవ్వడం సంచలన రికార్డులతో మొదలు పెట్టినప్పటికీ కూడా తర్వాత ఎందుకో అంచనాలను అందుకోలేక పోయిన ఈ టీసర్ డీసెంట్ రికార్డులనే సొంతం చేసుకుంటూ వచ్చింది.

కానీ రిలీజ్ అయిన రోజు ఎండ్ టైం కి యూట్యూబ్ లో ట్రెండ్ కూడా కాలేదు. యూట్యూబ్ అప్ డేట్ కారణంగా ఈ ఇష్యూ రాగా ట్రెండ్ పేజ్ లో కి రావడానికి ఆ రోజు పట్టింది. ఇక తర్వాత రోజు ట్రెండ్ పేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నుండి నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూ వస్తుంది ఈ టీసర్…

రోజులు గడుస్తూ పోతున్నాయి కానీ వకీల్ సాబ్ టీసర్ టాప్ ప్లేస్ లోనే ట్రెండ్ అవుతూ వస్తుంది. ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు 95 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ వస్తుంది ఈ టీసర్… ఇంకా కొన్ని గంటల పాటు ఈ ట్రెండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉండగా… 100 గంటల మార్క్ ని కూడా అందుకునే అవకాశం పుష్కలంగా ఉన్న ఈ టీసర్ రికార్డులు మిస్ అయినా కానీ..

ట్రెండ్ పేజ్ లో మాత్రం నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది…. ఆల్ రెడీ తెలిసిన కథనే అయినా హీరోయిజంతో మార్పులు చేసి ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ తో వకీల్ సాబ్ టీసర్ మంచి అంచనాలను పెంచింది. పవర్ స్టార్ క్రేజ్ తో నాన్ స్టాప్ ట్రెండ్ తో దూసుకు పోతున్న టీసర్ ఇంకా ఎన్ని గంటలు ట్రెండ్ ఇలానే అవుతుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here