Home న్యూస్ అరాచకం ఇది…ఒక్క ఇయర్ లో 980 కోట్లు….ఈ హీరో తోపు తురం ఖాన్!!

అరాచకం ఇది…ఒక్క ఇయర్ లో 980 కోట్లు….ఈ హీరో తోపు తురం ఖాన్!!

1814
0

లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ వలన ఈ ఇయర్ సెకెండ్ వలన చాలా సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి, అలాగే కొందరు స్టార్స్ అల్టిమేట్ ఫామ్ కి కూడా టైం బ్రేక్ వేసింది… అలాంటి హీరోల్లో అందరి కన్నా ముందు నిలిచిన హీరోగా అక్షయ్ కుమార్ అని చెప్పాలి. గత రెండేళ్ళ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ ఫాం లో ఉన్న అక్షయ్ లాస్ట్ ఇయర్ నుండి తన సినిమాలను డిజిటల్ లో రిలీజ్ చేస్తున్నా అంతకుముందు ఒక్క ఇయర్ లోనే అద్బుతాలు సృష్టించాడు.

2007 టైం లో కెరీర్ బెస్ట్ ఫాం తో అల్టిమేట్ విజయాలను సొంతం చేసుకున్న అక్షయ్ తర్వాత అడపా దడపా హిట్స్ కొట్టినా మళ్ళీ అలాంటి ఫాం అందుకోలేదు, మళ్ళీ ఇప్పుడు 2019 లో తన సినిమాల కలెక్షన్స్ మిగిలిన హీరోల సినిమా ల కలెక్షన్స్ కన్నా చాలా ఎక్కవగా ఉన్నాయి.

అందుకే అక్షయ్ కుమార్ ని వన్ మ్యాన్ ఆర్మీ అంటారు, ఒక్క ఇయర్ లో మినిమమ్ 3 నుండి 4 సినిమాలతో బిజీగా ఉంటాడు అక్షయ్. లాస్ట్ ఇయర్ అక్షయ్ నటించిన 4 సినిమాల ఇండియా కలెక్షన్స్ టోటల్ గా 980 కోట్ల మార్క్ రేంజ్ లో ఉండటం తన ఫాం కి నికార్సయిన నిదర్శనం అని చెప్పొచ్చు.

ఇయర్ మొదట్లో కేసరి సినిమా 155.7 కోట్లు వసూల్ చేయగా తర్వాత మిషిన్ మంగల్ కెరీర్ లో మొదటి 200 కోట్ల సినిమా అయ్యింది. ఫైనల్ రన్ లో 203.8 కోట్లు వసూల్ చేసింది ఆ సినిమా. ఇక దీపావళి కి హౌస్ ఫుల్ 4 మిక్సుడ్ రివ్యూ లతో కూడా 210.25 కోట్లు అందుకోగా.. ఇయర్ ఎండ్ లో వచ్చిన గుడ్ న్యూస్ 205.10 కోట్లు కలెక్ట్ చేసింది.

మొత్తం మీద ఈ 4 సినిమాల కలెక్షన్స్ 775 కోట్లు అందుకోగా గ్రాస్ 840 కోట్ల దాకా ఉంటుంది, అన్ని సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 980 కోట్ల రేంజ్ కి తగ్గని వసూళ్ళతో ఇయర్ ని ఓ రేంజ్ లో ఎలాడు అక్షయ్. ఇక 2020 లో కూడా అక్షయ్ సూర్య వంశీ, లక్ష్మీ లాంటి సినిమాలను రిలీజ్ కి అడ్డంకి రాగా లక్ష్మీ డిజిటల్ రిలీజ్ అవ్వగా ఈ ఇయర్ బెల్ బాటం డిజిటల్ రిలీజ్ కానుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here