మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో అన్ సీజన్ లో మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా, రెండో వీక్ లో కొత్త సినిమాలు ఏవి లేక పోవడంతో ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర…
దాంతో కలెక్షన్స్ పరంగా అనుకున్న అంచనాలను మరోసారి మించి పోతూ వీకెండ్ లో కలెక్షన్స్ వీర విహారం చేసింది ఇప్పుడు. 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అలాగే వరల్డ్ వైడ్ గా కూడా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే వసూళ్ళని అందుకుంది.
8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.01 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 9వ రోజున సాలిడ్ గ్రోత్ ని చూపించిన సినిమా 1.57 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దక్కించుకుని ఊరమాస్ హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా కూడా అన్ని చోట్ల కుమ్మేసిన సినిమా…
2.15 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దక్కించుకుని కుమ్మేయగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ కూడా ఆల్ మోస్ట్ 4 కోట్ల రేంజ్ లో మాస్ రచ్చ చేయడం విశేషం. IPL మ్యాచ్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నా మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేదు. ఇక టోటల్ గా సినిమా..
బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#CourtStateVsANobody 9 Days WW Collections(Inc GST)
👉Nizam – 8.45CR~
👉Ceeded – 1.22CR~
👉Andhra – 6.48Cr~
AP-TG Total – 16.15CR(27.40CR~ Gross)
👉KA+ROI: 1.95Cr
👉OS- 4.60CR
Total World Wide Collections: 22.75CR(43.10CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 15.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో హ్యూజ్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.