Home న్యూస్ 12 ఇయర్స్ ఓల్డ్ మూవీ…9 రోజుల్లో మెంటల్ మాస్ కలెక్షన్స్!!

12 ఇయర్స్ ఓల్డ్ మూవీ…9 రోజుల్లో మెంటల్ మాస్ కలెక్షన్స్!!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరైన విశాల్(Vishal) అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం చేసిన మధగజ రాజా(Madha Gaja Raja Collections) సినిమా అనేక కారణాల వలన రిలీజ్ కి నోచుకోలేదు…ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా సడెన్ గా ఈ ఇయర్ సంక్రాంతికి…

తమిళ్ లో అసలు ఎలాంటి పోటి లేకుండా ఖాళీగా ఉండటంతో సడెన్ గా రిలీజ్ ను అనౌన్స్ చేయగా అందరూ ఈ సినిమా ను ఇప్పుడు ఎవరు చూస్తారబ్బా అని అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళనాట రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తుంది…

సినిమా సంక్రాంతి సెలవుల్లో తమిళ్ లో అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది…9 రోజుల్లో ఓవరాల్ గా తమిళనాడులో సినిమా ఏకంగా 43.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఓ రేంజ్ లో వీర విహారం చేసింది…

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా మరో 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 9 రోజులు పూర్తి అయ్యే టైంకి 45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని కుమ్మేసింది..షేర్ ఆల్ మోస్ట్ 24 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…

12 ఏళ్ల క్రితమే రిలీజ్ అయ్యి ఉన్నా కూడా ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేదో లేదో కానీ ఎలాంటి పోటి లేకుండా సంక్రాంతికి రావడం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చి అంచనాలను మించి పోయే కలెక్షన్స్ తో ఇప్పుడు తమిళ్ లో 50 కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here