బాక్స్ అఫీస్ దగ్గర బాహుబలి(Baahubali) సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దుమ్ము లేపగా మధ్యలో ఒక్క రాధే శ్యామ్ సినిమా తో తీవ్రంగా నిరాశ పరిచినా కూడా మిగిలిన సినిమాలు పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేశాయి…
ఆది పురుష్(Adi Purush) భారీ గా ట్రోల్స్ ని ఫేస్ చేసినా సలార్(Salaar) రాంగ్ టైం రిలీజ్ వలన ఇబ్బందులు ఫేస్ చేసినా కూడా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki2898AD Movie)మూవీ పెద్దగా ప్రమోషన్స్ లాంటివి ఏమి కూడా…
లేకుండానే రిలీజ్ అయ్యి యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. కాగా సినిమా ఇప్పుడు 9 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుని క్లీన్ హిట్ జాబితాలోకి ఎంటర్ అయ్యింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర 370 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది…8 రోజుల్లోనే ఏకంగా 361 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక 9వ రోజు సాధించే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర…
బ్రేక్ ఈవెన్ బాలెన్స్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ జాబితాలోకి ఎంటర్ అయ్యింది. మేకర్స్ సినిమా మీద నమ్మకంతో అడ్వాన్స్ బేస్ మీదే రిలీజ్ చేశారు. ఆ వాల్యూ టార్గెట్ ను దాటేసిన కల్కి మూవీ ఇప్పుడు ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్, షేర్ అండ్ బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.