బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని అతి కష్టం మీద పూర్తీ చేసుకున్న ఆచార్య సినిమా ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా మొదటి వారంతో పోల్చితే రెండో వారంలో టికెట్ హైక్స్ తగ్గించడంతో షేర్స్ ని కొంచం ఎక్కువగా సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపలేక పోతుంది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా….
రెండో వీకెండ్ లో శనివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కొత్త సినిమాలు మరీ అద్బుతంగా లేక పోయినా కానీ ఆచార్య సినిమా అసలు ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక పోతుంది. దాంతో ఇక చరిత్రలో నిలిచి పోయే నష్టాలు సినిమా ఇక సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
వీకెండ్ లో కూడా సినిమా డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విచారకరం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో కొంచం గ్రోత్ ని చూపిస్తే నష్టాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ సినిమా అసలు తేరుకోలేక పోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర…..