బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా పెద్దదిగా ఉండటంతో ఇప్పుడు సాధిస్తున్న కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. హోళీ హాలి డే రోజున కూడా సినిమా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది. ఇక 9 వ రోజు వీకెండ్ లో మరో రోజు అవ్వడంతో…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది కానీ టార్గెట్ ను అందుకోవడానికి ఇది సరిపోదు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు సినిమా 8 వ రోజు తో పోల్చితే 10-15% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో…
కొద్ది వరకు జోరు చూపిస్తే సినిమా 9 వ రోజున తెలుగు రాష్ట్రాలలో 35-40 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది… అవి కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యమని చెప్పాలి. మరి సినిమా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందా లేక ఇదే రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…
From 4 th day movie loss by 125 crores plz stop it bro its waste of time for updating collection report for radhe shyam