బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ 9వ రోజు ఓవరాల్ గా అన్ని చోట్లా రిమర్కబుల్ గ్రోత్ తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రోజుని…
ఎండ్ అయ్యే టైం కి ఊరమాస్ కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 8వ రోజు తో పోల్చితే 9 వ రోజు ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ లో గ్రోత్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది…. ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఇవి అంచనాలు మాత్రమే… ఫైనల్ లెక్కలు అంచనాలను ఇంకా మించి పోయే రేంజ్ లో ఉన్నాయి. ఇక హిందీ లో సినిమా ఈ రోజు 18 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఫైనల్ లెక్కలు 20 కోట్ల మార్క్ కి వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉంది.
ఇక సినిమా కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళలో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోబోతుండగా ఈ రోజు 7-8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఓవరాల్ గా ఇండియా లో సినిమా కి 9 వ రోజు మొత్తం మీద 31-32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా…
9 వ రోజు 35 కోట్ల నుండి 36 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది నిజంగానే ఊహకందని ఊచకోత అనే చెప్పాలి. ఇక సినిమా మిగిలిన రోజుల్లా ఈ రోజు కూడా అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సాధించే ఛాన్స్ ఉంది. మరి అఫీషియల్ కలెక్షన్స్ లెక్క అంచనాలను మించి పోతుందా లేక ఇదే రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో చూడాలి…