బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ మొదటి వారంలో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా, రెండో వారంలో అడుగు పెట్టి మళ్ళీ మంచి హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా…
ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఏవి పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోతూ ఉండటంతో తిరిగి యూత్ అండ్ కామన్ ఆడియన్స్ కి కోర్ట్ మూవీ నే మొదటి ఛాయిస్ అవ్వగా 8వ రోజుతో కంపేర్ చేస్తే సినిమా 9వ రోజున మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ…
పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల బుకింగ్స్ బాగున్నా ఈవినింగ్ షోల టైంకి IPL మ్యాచ్ ఇంపాక్ట్ ఉండగా ఓవరాల్ గా సినిమా డీసెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకోబోతుంది..
మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే సినిమా 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.3-1.5 రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక అంచనాలను మించితే కోటి షేర్ మార్క్ ని దాటే ఛాన్స్ ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.8-2 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో ఉన్నంతలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఫైనల్ 9 డేస్ కలెక్షన్స్ ఎంతవరకు అంచనాలను మించుతాయో చూడాలి.