బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వీక్ లో అడుగు పెట్టగా 8వ రోజు పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా 9వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉంది..
తమిళ్ అండ్ కేరళలో ఇక తేరుకునే అవకాశం కనిపించడం లేదు కానీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీ, కర్ణాటక మరియు ఓవర్సీస్ లో మాత్రం మంచి హోల్డ్ ని చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమా 9వ రోజు ఓవరాల్ గా టికెట్ సేల్స్ పరంగా…
8వ రోజు మీద మంచి గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక సినిమా హిందీలో బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది…ఇక సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి ఓవరాల్ గా మరో కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరగవచ్చు. ఓవరాల్ గా 9వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 6.5-7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ గా సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.