రెండో వారంలో అడుగు పెట్టినా కూడా ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) రెండో వారంలో ఎలాంటి పోటి లేక పోవడంతో…
మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ దూసుకుపోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి హోల్డ్ ని చూపించగా 8వ రోజుతో పోల్చితే 9వ రోజున మరోసారి మంచి ట్రెండ్ ని చూపిస్తూ ఇప్పుడు అటూ ఇటూగా 1.2 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళ్ లో సినిమా ఈ రోజు అటూ ఇటూ గా 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ మొత్తం మీద 5 కోట్ల మార్క్ ని అందుకునే…
అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కొంచం స్లో అయినా కూడా ఓవరాల్ గా ఇప్పుడు 9వ రోజున వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆల్ మోస్ట్ 8 వ రోజు లెవల్ లో సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజున కలెక్షన్స్ ని అందుకోబోతుంది. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పోతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు. ఇక సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 9 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.