Home న్యూస్ 9th డే కల్కి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….ప్రభాస్ మాస్ ఊచకోత ఇది!

9th డే కల్కి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….ప్రభాస్ మాస్ ఊచకోత ఇది!

0

3 నెలల టాలీవుడ్ అన్ సీజన్ కి ఎండ్ కార్డ్ వేసి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) రెండో వారంలో అడుగు పెట్టి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.

9వ రోజులో అడుగు పెట్టిన సినిమా మరోసారి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి నైజాంలోనే ఎక్కువ హోల్డ్ ని చూపించగా ఆంధ్ర సీడెడ్ లు పర్వాలేదు అనిపించేలా ఉండగా మొత్తం మీద సినిమా ఇప్పుడు 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా….

5 కోట్ల రేంజ్లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 5.5 కోట్లకి చేరువ అవ్వొచ్చు. ఇక హిందీలో సినిమా 10 కోట్లకు అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఇండియాలో సినిమా 13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 9 రోజున…

16 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా మరోసారి రెబల్ స్టార్ మాస్ స్టార్ పవర్ ను చూపిస్తూ సినిమా అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతుంది…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను మరోసారి సినిమా మించే అవకాశం ఉండగా ఇక శని మరియు ఆదివారాలలో సినిమా రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 9 రోజులకు గాను సాధించే టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here