రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని సెకెండ్ వీక్ లో అడుగు పెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) సాలిడ్ కలెక్షన్స్ తో 8వ రోజున హోల్డ్ చూపించిన తర్వాత ఇప్పుడు 9వ రోజున…
మరోసారి సాలిడ్ జోరుని చూపెడుతూ దూసుకు పోతుంది. ఒక పక్క అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూ కొన్ని షోలకు ఇబ్బంది ఎదురు అయినా కూడా నార్త్ సైడ్ అలాగే ఇక్కడ కూడా మంచి హోల్డ్ నే సినిమా చూపిస్తూ దూసుకు పోతూ ఉంది….
ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 3.6-4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది..ఇక కర్ణాటక, తమిళ్ అండ్ కేరళ కలిపి సినిమా…
2.5-3 కోట్ల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకునే అవకాశం ఉండగా హిందీలో ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా అక్కడ 22-23 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి మంచి జోరుని చూపెడుతున్న సినిమా..
ఓవరాల్ గా ఈ రోజు వరల్డ్ వైడ్ గా 21-22 కోట్లకి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.