Home న్యూస్ 9 సార్లు 100M….టాలీవుడ్ చరిత్రలో ఒకేఒక్కడు!!

9 సార్లు 100M….టాలీవుడ్ చరిత్రలో ఒకేఒక్కడు!!

0
Ram Pothineni Hindi Dub Movies Hits 9 times 100M Views Mark Record for Tollywood Hero
Ram Pothineni Hindi Dub Movies Hits 9 times 100M Views Mark Record for Tollywood Hero

ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) మూవీ తో మాస్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని మంచి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోగా రామ్ నటించిన సినిమాలు తర్వాత అన్నీ కూడా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే రాగా ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా…

మరో పక్క రామ్ నటించిన సినిమాలకు హిందీలో కూడా సూపర్ డిమాండ్ ఉండగా రామ్ నటించిన సినిమాలకు హిందీ డబ్ అయ్యి సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాలు ఇతర హీరోలతో కంపేర్ చేస్తే ఎవ్వరూ కూడా రామ్ ని అందుకోలేనంత స్పీడ్ తో దూసుకు పోతూ ఉండగా…

రామ్ నటించిన సినిమాలు వరుసగా హిందీలో డబ్ అయ్యి 100M వ్యూస్ మార్క్ ని అవలీలగా అందుకుంటూ ఉండగా లేటెస్ట్ గా రామ్ నటించిన స్కంద(Skanda Movie) హిందీలో డబ్ అయ్యి 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించడం విశేషం…

The Warriorr 9 Days Total World Wide Collections!

కాగా మొత్తం మీద రామ్ నటించిన సినిమాలు ఓవరాల్ గా 9 ఇప్పటి వరకు హిందీ లో డబ్ అయ్యి 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్నాయి…స్కంద, ది వారియర్, హలో గురు ప్రేమ కోసమే, వున్నది ఒకటే జిందగీ, నేను శైలజా, పండగ చేస్కో, ఇస్మార్ట్ శంకర్, గణేష్, హైపర్ సినిమాలు హిందీలో…

100 మిలియన్ వ్యూస్ ని దాటగా ఇందులో కొన్ని సినిమాలు, 300, 400, 500, ఏకంగా 600 మిలియన్ మార్క్ ని కూడా దాటేసి సంచలనం సృష్టించడం విశేషం. కాగా ఓవరాల్ గా ఈ లిస్టులో హైపర్ మరియు గణేష్ సినిమాలు 100 మిలియన్ ను దాటిన తర్వాత ఛానెల్ లో మూవీస్ ని డిలేట్ చేశారు…

దాంతో ఓవరాల్ గా ప్రస్తుతం లైవ్ లో ఉన్న మూవీస్ పరంగా 7 సినిమాలు 100 మిలియన్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా అన్ని మూవీస్ ని చూసుకుంటే 9 సినిమాలతో టాలీవుడ్ లో ఎవ్వరికీ అందనంత జోరుతో హిందీలో రచ్చ లేపుతున్నాడు…ఇక హిందీలో త్వరలో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రామ్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

SKANDA Movie Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here